parents please thinking about your childrens – తల్లి తండ్రులు దయచేసి తమ పిల్లల గురించి కాస్త ఆలోచించండి ?

తల్లిదండ్రులు నిజంగా తమ పిల్లల గురించి ఆలోచించరా ? ఆలోచిస్తారు కానీ తమ పిల్లలు బలంగా సామర్థ్యం గా ఉన్నారని, ఊహించుకుంటారు కానీ నిజంగా వారు అనుకున్నది అబద్ధం.

పిల్లల సామర్థ్యాలను తల్లిదండ్రులు అర్థం చేసుకుంటున్నారా:

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు వారి గురించి, అన్నీ తెలుసుకొని వారికి మంచి భవిష్యత్తు ఇస్తున్నామని తల్లిదండ్రుల ఆలోచనలను పిల్లలకు రుద్దడం జరుగుతుంది. దీనివల్ల పర్యావసనాలు తల్లిదండ్రులు అంచన వేయలేకపోతున్నారు.

పిల్లల సామర్థ్యాలు మొదటి దశలోని వారికి తెలిసి పోతుంటాయి:

వారికి నిజాలు తెలిసిపోతాయి కానీ ఇంకా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేపిస్తే మన పిల్లలు అభివృద్ధి చెందుతారని అనుకున్న సీటు సంపాదిస్తారని తల్లిదండ్రుల తాపత్రయ పడుతుంటారు.

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఎంతమంది వారికి ఏమి కావాలో వారికి ఏమీ రాదు తెలుసుకొని సరే కానీ వీడికి ఇంత సామర్థ్యం లేదు అనుకోని ఇంకో దానిలో వాడిని నైపుణ్యాన్ని పెంచుకోమని ప్రోత్సహిస్తారా!

నేటి సమాజంలో పిల్లలు ఆ భద్రత భావంలో ఉంటున్నారు ?

సమాజంలో ప్రతి మనిషికి ఉన్న సామర్థ్యాలు అందరికీ ఒకే విధంగా ఉండవు కొందరు మృతి నైపుణ్యం లో బాగా అభివృద్ధి చెందుతారు మరికొందరు బాధ్యస్థాయిలోనే ఉంటారు ఇంకొందరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు.

నేటి సమాజంలో విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు?

పిల్లలు ఎంత ప్రయత్నించినా చదవలేక నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేక వారిని బాధ పెట్టలేక వారికి చెప్పలేక తనువు చాలిస్తున్నారు.

అందుకే తల్లిదండ్రులారా చేతులు కాలాక ఆకులు పట్టుకోకండి !

. అందుకే వారి సామర్ధ్యాలను ఎప్పటికప్పుడు అంచనా వేయండి.

. వారితో ఏ విధంగా మెలగాలో ఆలోచించండి వారికి ఏమి చేస్తే మంచి జరుగుతుందో వారు ఎందులో మెరుగ్గా ఉన్నారు తెలుసుకోండి.

. అపజయం వచ్చినప్పుడు కుంగిపోకుండా పిల్లలకు మంచి ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి తల్లిదండ్రులు తమ అమూల్య సంపద తమ పిల్లలే అని గుర్తించాలి.

తమ పిల్లలు సామర్ధ్యాలు బలంగా ఉన్నాయని మీరు నమ్మవద్దు మీరు వారిని ఎప్పుడు అంచనా వేస్తూ ఉండాలి. వారు బాగానే ఉన్నారు అని మీరు నమ్మితే అది మీ జీవితకాల బాధలకు కారణం అవుతాయి వారి ఆత్మహత్యలకు పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు కూడా ఒక భాగం అవుతారు .అప్పుడు మీరు అనుకుంటారు మా పిల్లలను ఒత్తిడి చేయలేకపోతే వారికి ఈ పరిస్థితి ఉండేది కాదు . మేము జీవితాంతం ఏడ్చే వాళ్ళం కాదు . అని మీరు అనుకుంటూ ఉంటే ఏం లాభం అందుకే చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలి ఇది తెలుసుకోండి తల్లిదండ్రులారా.

Latest Stories

Leave a Comment