కైలాస టెంపుల్ నిఅసలు ఎలా నిర్మించారు, ఆ కాలంలో ఉపయోగించిన టెక్నాలజీ ఏమిటి, ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయాన్ని ఎవరి నిర్మించారు అనే ఈ అంశాలను మనం లోతుగా తెలుసుకుందాం

ప్రదేశం: భారత్ లోని మహారాష్ట్ర అనే రాష్ట్రంలో ఔరంగాబాద్ నగరానికి సమీపంలో ఈ ఆలయనిర్మాణం జరింగింది.
నిర్మించినవారు: రాష్ట్ర కుట రాజులు
ఆలయనిర్మాణం:
ఈ ప్రపంచంలో అత్యంత వైవిధ్యంగా నిర్మించిన ఆలయం ఇది. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు రాష్ట్ర కుట రాజులు, ఈ ఆలయాన్ని అత్యంత పెద్దదైన ఒకే రాయినుండి నిర్మించారు. ఆ ఒక్క రాయి పైనుండి కింది వరకు అలాగా నిర్మాణాన్ని చేశారు. ఇలా నిర్మించిన ఆలయాలలో ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం ఈ విధంగా జరగలేదు. అప్పటి సాంకేతికత టెక్నాలజీ ఇప్పటికి, ఇప్పటికీ అర్థం కాకుండా ఉంది.

మన రాజులు ,మన పూర్వీకులు వాళ్ళు చేసిన ఇటువంటి నిర్మాణాలు , ఇప్పటికీ అద్భుతంగా సజీవ సాక్ష్యం గా నిలుస్తున్నాయి. ఈ ఆలయాలు ఈ ఆలయాల నిర్మాణానికి ఎన్నో వాస్తు, శిల్ప కల, శాస్తల అవసరం మిళితమై ఉన్నాయి. ఒక రాయిని పైనుండి కింది వరకు నిర్మించడం అంత తేలికైన విషయం కాదు ,కానీ అప్పటి వైజ్ఞానికులు ,ఈ ఆలయాన్ని అద్భుతంగా అత్యంత సాంకేతిక నైపుణ్యంతో నిర్మించారు. ఈ ఆలయం ప్రపంచంలో మరొకటి లేదు. ఇది రాయిలో పై నుండి కింది వరకు రాయిని తొలచి నిర్మించిన అద్భుతమైన ఆలయం.
ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఈ ఆలయాన్ని నిర్మించడానికి 150 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు భావిస్తున్నారు.
ఈ ఆలయాన్ని అనేక ముస్లిం రాజులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ ఆలయం ఇప్పటికీ మనకు సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది .ఇంకా మరో వెయ్యి సంవత్సరాలైనా ఈ ఆలయం సజీవంగానే ఉందనడం లో సందేహం ఏమాత్రం లేదు .ఈ ఆలయం పైనుండి కింది వరకు నిర్మించడం ఒక విశిష్టత, అయితే ఆ ఆలయం నిర్మించిన సమయాల్లో అందులో నుండి 20 నుంచి 30 లక్షల టన్నుల రాళ్లు ఎక్కడ పడేశారు ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న .దానితో ఈ గొప్ప ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు, ఈ ఆలయం యొక్క విశిష్టత మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది.