How to happyness in your life –

నీ జీవితంలో సంతోషంగా ఎలా ఉండాలి:

How to happyness in your life:

అసలు సంతోషం అటే ఏమిటి ? మనసుకు ఆనందాన్ని ఇచ్చే, మనకు మనకు ఒక రకమైన తృప్తిని ఆనందాన్ని నవ్వుకునే అన్ని కలయికల మానసిక ప్రశాంతతే సంతోషం .

జీవితం ఒకే విధంగా ఎప్పుడు ఉంటుందా?

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, ఎప్పుడు మార్పు చెందుతూ ఉండేది జీవితం .ఒకే విధంగా ఉంటే ఇంకా ఏముంటుంది? మనిషి మారడం సహజం .మనిషికి కష్టాలు రావడం సహజం. కష్టాలు నాకు రాకూడదు అవివేకమే అవుతుంది.

మనకు కావలసింది తృప్తి

ప్రతి మనిషికి అన్నీ ఉండవు. సంపద ఉండదు, మరియు అనేక రకమైన వస్తువులు ఉండువు. అవసరాలకు తగినంత డబ్బు, ఉండదు కానీ మరి బతకడం ఎలా ? కొన్ని సందర్భాల్లో మనకు ఏమీ లేకుండా ఉండవచ్చు కానీ మనకు కావలసింది ఏమిటి ఒక రకమైన తృప్తి !ఉన్నదాంట్లో సర్దుకుని తత్వం మనిషికి ఉండాలి. లేని వాటి గురించి ఆలోచించకుండా, ఉన్నదాంట్లో సర్దుకుని మరింత ముందుకు సాగడేటట్టు చేసుకోవాలి. లేకుంటే ఇది నాకు లేదు? అని మనం బాధపడితే ఎవరిస్తారు ? కాబట్టి మనకున్న దాంట్లోని మనం సర్దుకోవాలి.

మంచి అలవాట్లు సంతోషానికి కారణం అవుతాయా?

ఇది కచ్చితంగా నిజం !మంచి అలవాట్లు సంతోషానికి కారణం అవుతాయి .ఎందుకంటే మనము బాధపడే అంశాలు మన యొక్క అలవాట్ల వల్లనే అవుతాయి కదా! కాబట్టి మనకు మంచి అలవాట్లు ఉంటేనే మనం బాధపడం .మరింత తెలివితేటలతో ముందుకు సాగే ప్రయత్నాలు కచ్చితంగా చేస్తాం. కాబట్టి ప్రతి మనిషికి ఉండే అలవాట్లు మంచిగా ఉండాలి.

ప్రతి జీవితానికి డబ్బు అవసరం ఎంతవరకు ఉంటుంది?

ప్రతి జీవితానికి డబ్బు అవసరం కచ్చితంగా ఉంటుంది. డబ్బు అవసరం లేని ప్రతి మనిషి ఉండడం సాధ్యం కాదు. ఈ జీవితంలో మన రోజు వరి కార్యక్రమాల్లో, డబ్బు అవసరం కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు కావలసిన వస్తువులు మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కావాలి. మనుషుల మధ్య ఆర్థిక అసమానతలకు కారణం డబ్బు.

“కానీ డబ్బు జీవితంలో ఒక పరిమితమైన భాగం కానీ జీవితమే డబ్బు మయం కాకూడదు”

మనిషి జీవితానికి కావలసిన డబ్బు మన యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉండాలి. కానీ మనం దానికి లొంగే విధంగా ఉండకూడదు. మనకు కావాల్సిన డబ్బులు జాగ్రత్తగా ఉంచుకుంటూ, మన అవసరాలు తీర్చుకుంటూ , మానవ సంబంధాలు కలిగి ఉండాలి. పరిమితమైన ఆనందమే కాకుండా అనంతమైన సంతోషంతో జీవితాన్ని సాగించాలి.

డబ్బు ఉన్నంత మాత్రాన ధనవంతులు ఆనందంగా ఉంటున్నారా:

ఉన్నవాడికి మరింత కావాలనే ఉంటుంది. కానీ ఇక చాలు అని ఎవరు అనుకోరు. కానీ అన్నింటికి డబ్బే కారణం కాదు !ఎందుకంటే భార్యాభర్తల సంబంధాలు, ఇంటిలో పిల్లల మధ్య సంబంధాలు, కుటుంబ వ్యవహారాలలో డబ్బు ను చ్చేర్చకూడదు. అన్ని మన యొక్క మాటలతో ,మన యొక్క చేతులతో, మన యొక్క ఆనందం ఆధారపడి ఉంటుంది.

ఆనందంగా ఉండటానికి మార్గాలు:

మనం ఆనందంగా ఉండటానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మన యొక్క కుటుంబం. మన కుటుంబంతో మనం కలిసి కలిసిమెలిసి ఎటువంటి అపార్థాలు లేకుండా సంతోషంగా జీవితం సాగుతుంది. కుటుంబం ఆ కుటుంబంతోనే మన యొక్క ఆనందం ముడిపడి ఉంటుంది.

కుటుంబంతోపాటు సమాజం కూడా మన యొక్క ఆనందంలో భాగమే ?ఎందుకంటే మన యొక్క రోజు వారి కార్యక్రమాలలో, మన యొక్క ఉద్యోగాలలో ,సమాజం యొక్క బాధ్యత తప్పనిసరి కాబట్టి మనం సమాజంతో కూడా కలిగే ఉండాలి. ఎవరితోనూ నాకు అవసరం లేదు నాకు డబ్బు ఉంటే చాలు అని అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి సమాజం తొ కలిసిమెలిసి ఉంటే మరింత అభివృద్ధి చెందుతారు.

కొందరికి వృత్తిపరమైన సమస్యలు ఉండవచ్చు. కానీ ఆ యొక్క సమస్యలను అధిగమించడానికి కాలక్షేప మార్గాలను వెతకాలి. పుస్తకాలు చదవడం, లేకపోతే ఆర్టికల్స్ చదవడం ,ఒక రకమైన సాంగ్స్ వినడం, మరియు ఒక రకమైన ఒక రకమైన పద్ధతులను అలవాటు చేసుకోవాలి.

సమస్యలను అధిగమిస్తూ, ఉత్తమమైన మార్గాలను వెతుకుతూ, మరింత అభివృద్ధి చెందుతూ, ముందుకు సాకే మార్గాలను మనం ఎప్పుడు వెతకాలి .మనం ఏం చేస్తే ఆనందము అవుతుంది? మనం ఎలా ఉంటే ఆనందంగా ఉండగలుగుతం అనే అంశాలపై ప్రదానంగా దృష్టి పెట్టాలి .అదే మన ఆనందానికి కారణం అవుతాయి.

ఎవరైనా చెప్పిన విషయాలు శ్రద్ధగా వినాలి, కసరుకోవడం ఉండే అలవాటుని తీసివేయాలి .అది మంచి అలవాటు కాదు. మనకు కావలసిన వారితో మనం కలివిడిగా ఉంటూ యొక్క సుఖదుఃఖాలను పంచుకుంటూ, మంచిగా ఉండాలి, మన స్నేహితులుతో కానీ మన కుటుంబ సభ్యులతో కానీ మన యొక్క చుట్టాలతో కానీ ,మన యొక్క సంబంధాలు మరింత మెరుగుపరుచుకోవాలి.

కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి.బయట విషయాలను ఇంటిలోకి తీసుకురాకూడదు .ఇంట్లోని విషయాలను బయటకు తీసుకువెళ్లకూడదు. ఇంట్లో ఉన్న సమస్యలను ఇంట్లోనే పరిష్కరించాలి .బయట అభివృద్ధి పరమైన సమస్యలను మాత్రమే కుటుంబంతో చర్చించాలి .

మంచి ఆహారపు అలవాటును అలవాటు చేసుకోవాలి. వ్యసనాలకు లోను కాకుండా మంచిగా ఉండాలి .అప్పుడే మన యొక్క శరీరం కానీ, మన యొక్క మానసికంగా గాని మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం.

మనం అభివృద్ధి చెందుతూనే సమాజాన్ని అభివృద్ధి చెందించాలి. సేవగుణాన్ని అలవాటు చేసుకోవాలి .ఇతరులకు సేవ చేసే భాగ్యం అందరికీ ఉండదు సమాజానికి మన వంతుగా మనం చేసి చిన్న పని సేవ సేవ. అందరూ చేస్తేసమాజ నిర్మాణం ముందుకు సాగుతుంది

మనం ఇతరులు మనపై వేసి మాటలకు మనం అతిగా స్పందించడం మానుకోవాలి, దీని వల్ల ఉపయోగం ఏమిటి? దీని వల్ల ఎవరు బాధపడతారు? అనే అంశంపై మనం విశ్లేషించాలి. కాబట్టి ఇతరుల మాటలకు అధిక స్పందించడం ఉండకూడదు. మనకు మనముగా ముందుకు సాగాలి .ఇతరుల విషయాలను ఎక్కువగా కలగ చేసుకోవడం, కానీ ఇతరుల విషయాలకు ఎక్కువగా స్పందించడం కానీ ఇలా అనేక విషయాలు సంతోషానికి కారణం అవుతున్నాయి .

ఆరోగ్యకరమైన అలవాట్లే సంతోషానికి మార్గాలు మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం.

Latest Stories

Leave a Comment