Beautiful Love story -అందమైన ప్రేమ కథ -2025

ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి జీవితంలో ఏదో ఒక సందర్భంలో చదువుకునే రోజుల్లో కావచ్చు ఉద్యోగాలు చేసే రోజుల్లో కావచ్చు ఎవరికైన ఇష్టం పెరగవచ్చు అది ప్రేమగా మారవచ్చు కొందరికి ప్రేమ పెళ్లిగా కూడా మారవచ్చు.

ప్రారంభంశం:

నిహాల్ గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థి నిహాల్ తల్లిదండ్రులు వ్యవసాయదారులు వారు ప్రతి రోజు వ్యవసాయ క్షేత్రంలో పనిచేయడానికి వెళుతూ ఉంటారు పని యొక్క విలువను నిహాల్ కు చిన్ననాటి నుండి అలవాటు చేశారు అందుకే నిహాల్ కు వ్యవసాయం అన్న గ్రామీణ వాతావరణం అన్న నిహాల్ కు చాలా ఇష్టం అయితే నిహాల్ వాళ్ళ నాన్నగారు తమ కుమారుడు మంచిగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని నిహాల్ మంచి స్థాయిలో ఉండాలని నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు అనుకునేవారు అయితే ఇక్కడ నిహాల్ డిగ్రీ పూర్తయిన తర్వాత మాస్టర్స్ చేయడానికి అలాగే అక్కడ ఉద్యోగం సంపాదించడానికి అమెరికా కు నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు అక్కడ ఆండ్రియా అమెరికన్ గర్ల్ నిహాల్ కు పరిచయం అవుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ఎలా ప్రేమగా మారుతుంది ఆ ప్రేమ చివరిదాకా ఉంటుందా ఉండదా అన్న విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం!

నిహాల్ నేపథ్యం:

నిహాల్ గ్రామం తెలంగాణ రాష్ట్రంలోని ఒక చిన్న పల్లెటూరు నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ బతుకుతారు వారికి ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఎప్పుడు పంట తోటలతో పశువులతో కలకలలాడుతూ ఉంటుంది.

నిహాల్ కు తల్లిదండ్రులు అంటే చాలా ఇష్టం గౌరవం వారి మాటలను ఎప్పుడూ నిహాల్ నెగ్లెట్ చేసే వాడు కాదు తల్లిదండ్రులకు ఆసరాగా వ్యవసాయ పనులు కూడా చేస్తూ చాలా సంతోషంగా గడిపి కుటుంబం.

ఆండ్రియా నేపథ్యం:

ఆండ్రియా అమెరికాలోని న్యూయార్క్ సిటీలో జన్మించింది ఆండ్రియా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులు ఆండ్రియా వారి కుటుంబం చాలా ఉన్నతమైన కుటుంబం ఆండ్రియా సిటీ కల్చర్ చాలా తెలుసు ఎందుకంటే ఆండ్రియా పుట్టి పెరిగింది సిటీలోనే కాబట్టి ఆండ్రియాకు టూరిస్ట్ స్పాట్ కు వెళ్లాలన్న చాలా ఇష్టం హాలిడే దొరికితే ఎక్కడికైనా వెళ్దామని ఎప్పుడు కుటుంబంతో చెప్పేది చాలా టూరిస్ట్ ప్లేస్లను ఆమె చాలాసార్లు వెళ్ళింది కూడా.

కథ సారాంశం:

నిహాల్ అమెరికా ప్రయాణం:

నిహాల్ వ్యవసాయ పనుల్లోనే కాదు చదువులో కూడా చాలా మెరుగ్గా రాణించేవాడు నిహాల్ ఎప్పుడు చదువులో ముందుండేవాడు నిహాల్కు వరుసకు వరుసకు మేనమామ అయ్యే మహేష్ ఉండేవాడు నిహాల్కు మరియు అతని తల్లిదండ్రులకు చాలా దగ్గర బంధువు నిహాల్ డిగ్రీ పూర్తయిన తర్వాత మాస్టర్స్ కోసం అమెరికా పంపించాలని నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు అక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది అని మంచి శాలరీ వస్తుందని అక్కడ చదువు అయిపోయాక ఉద్యోగం సంపాదించి మంచి భవిష్యత్తు ఉంటుందని నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు నిహాల్ వాళ్ళ అమ్మ చాలా బెంగపెట్టుకుంది నిహాల్ అమెరికా వెళ్తే ఎప్పుడు వస్తాడు తింటాడో తినడో అని బెంగపెట్టుకుంది నిహాల్ వాళ్ళ నాన్న నిహాల్ కు చెప్పాడు నాన్న నీవు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి మంచి పేరు తీసుకురావాలి అదే నాకు కావాలి నాన్న అని నిహాల్ కు చెప్పాడు

అమెరికా వెళ్లాలంటే ముందుగా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలి ఇంటర్వ్యూ అటెంప్ట్ కావాలి ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ కమ్మని నిహాల్ కు వరుసకు మేనమామ అయ్యే మహేష్ చెబుతాడు నిహాల్ అమ్మకు వాళ్ళ నాన్న ఈ విధంగా చెబుతాడు. మన కొడుకు చాలా టాలెంట్ పర్సన్ వాడిని చదివించాలి వాడికి మంచి పేరు రావాలి. అందరి విధంగా కాకుండా నా కొడుకు ప్రత్యేకంగా ఉండాలి అందుకే నాకు కూడా బాధగా ఉన్నా వాడిని పంపియక తప్పేటట్లు లేదు నీవు కూడా బాధపడకు కొన్ని రోజుల తర్వాత వాడు మంచి స్థాయిలో ఉంటే అదే మనకు మంచిది అని నిహాల్ వాళ్ళ అమ్మని వాళ్ల నాన్న ఒప్పించాడు నిహాల్ మంచి మెరుగైన స్టూడెంట్ కాబట్టి ఫస్ట్ లోనే నిహాల్ కు అమెరికా ప్రయాణానికి మార్గం సుముగం అయింది.

నిహాల్ ఆలోచన విధానం:

నిహాల్ కు చిన్నప్పటినుండి గ్రామీణ వాతావరణం లో ఉన్నాడు కాబట్టి వ్యవసాయంలో కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ చూశాడు నిహాల్ చాలా మంచి వ్యక్తి తల్లిదండ్రులు అతన్ని చాలా ఇష్టపడతారు ఇరుగుపొరుగు కూడా చాలా ఇష్టపడతారు

నిహాల్ మనసులో తాను ఏదో ఒకటి జాబ్ చేస్తూ తమ తల్లిదండ్రులతో పాటు ఉంటూ గ్రామీణ జీవితంలో బతకాలని పశువులతో ప్రకృతి వ్యవసాయంతో చాలా ఆనందంగా జీవించాలని నిహాల్ యొక్క భావన కానీ తల్లిదండ్రుల ఆలోచనలను వారిని బాధ పెట్టకూడదు అన్న భావనతో నిహాల్ మరొక విషయం కూడా నిహాల్ మనసులోని మాటను చెప్పకుండా దాచుకున్నాడు తల్లిదండ్రుల కోరికను తీర్చడానికి అమెరికా వెళ్లడానికి సిద్ధమయ్యాడు

నిహాల్ అమెరికా వెళ్ళాడు:

ఆరోజు వచ్చేసింది అమెరికాకు వెళ్లాలి ఆరోజు వచ్చేసింది ఆరోజు నిహాల్ వాళ్ళ తల్లిదండ్రులు వారి మనసుల్లో తీవ్రమైన బాధను దాచుకుంటూ నిహాల్ సాగనంపుతూ ఉన్నారు అదేవిధంగా నిహాల్కు ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల ఇష్టాన్ని గౌరవించి అమెరికా వెళ్లాడు . నిహాల్ అమెరికా లోని న్యూయార్క్ లోని యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు.

న్యూయార్క్ యూనివర్సిటీలో నిహాల్:

నిహాల్ అమెరికా వెళ్ళాక అక్కడ తెలిసిన వాళ్ల సహాయంతో న్యూయార్క్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు.

నిహాల్ యూనివర్సిటీకి వెళ్లాక మొదటి రోజు క్లాస్ రూమ్ లోకి అడుగు పెట్టాడు అందులో చాలామంది అమెరికన్ కొందరు ఇండియన్స్ మరికొందరు ఇతర దేశస్తులు ఉన్నారు ప్రొఫెసర్ నిహాల్ను క్లాస్ రూమ్ లో పరిచయం చేస్తున్నాడు తర్వాత తన గురించి చెప్పమన్నాడు.

నిహాల్ చాలా అందమైన ఆకర్షణీయమైన యువకుడు అతడు ఇతరులు తనను ఆకర్షించేలా ఉంటాడు నిహాల్ తన గురించి చెప్పాడు .

అదే క్లాస్ రూమ్ లో ఆండ్రియా అనే అమెరికన్ స్టూడెంట్ తన క్లాస్మెట్ నిహాల్ను చూస్తూనే ఉంది . అతను చెప్పే విషయాలను చాలా ఆసక్తిగా వింటుంది . ఆండ్రియాను నిహాల్ ఆకర్షించాడు.

నిహాల్ కు ఆండ్రియా పరిచయం:

నిహాల్ తన స్నేహితుడి ద్వారా ఆండ్రియాను పరిచయం చేశాడు నిహాల్ మనసులో ఏమీ లేదు నిహాల్ కు చదువుకొని కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి ఇండియాకు వెళ్లాలని నిహాల్ ఉద్దేశం.

ఆండ్రియా ప్రతిరోజు నిహాల్ను పలకరిస్తూ ఉంది. నిహాల్ కూడా మామూలుగా చాలా సరదాగా మాట్లాడుతూ రోజు కాలేజీకి వెళ్తున్నాడు.

ఆండ్రియా మనసులో నిహాల్ మీద ప్రేమ:

ఇలా అందరితో సరదాగా మాట్లాడుతూ ఆరు నెలలు గడిచిపోయాయి.

ఆండ్రియా నిహాల్ ప్రవర్తనను చాలా గమనించింది నిహాల్ చాలా ఆకర్షణీయమైన యువకుడు చాలా మంచివాడు అతడి ప్రవర్తన చాలా బాగుంది ఇటువంటి యువకుడ్ని తన జీవితంలో ఎప్పుడు చూడలేదని అనుకుంటూ ఉంది ఆండ్రియా మనసులో నిహాల్ను ప్రేమిస్తుంది కానీ నిహాల్ మామూలుగా స్నేహితురాలుగా చూస్తున్నాడు నిహాల్కు తెలీదు ఆండ్రియా తనని ఇష్టపడుతుందని.

ఆండ్రియాకు నిహాల్ను ఇష్టపడుతున్నానని అతన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాలని ఉంది కానీ తాను చెబితే నేహా ఇష్టపడతాడా అని ఒకని ఒక సందర్భంలో ఆండ్రియా తన స్నేహితురాలు కు చెప్పింది నిహాల్ అంటే తనకు చాలా ఇష్టమని అతను నన్ను ప్రేమిస్తాడా అని తన స్నేహితురాలిని ఆండ్రియా అడిగింది.

స్నేహితురాలు బదులిస్తూ నీవు క్లాసులోనే చాలా అందమైన అమ్మాయివి నీకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయని నేను అనుకుంటా నీవు ఒక ఇండియన్ స్టూడెంట్ ని ఇష్టపడటం నేను నమ్మలేకపోతున్నా అని ఆండ్రియా స్నేహితురాలు చెప్పింది.

ఆండ్రియా బదులిస్తూ నిజమే నాకు చాలా ప్రపోజల్స్ చాలా చాలా రోజుల నుండి వస్తూనే ఉన్నాయి కానీ నాకు ఇది అంతా ఇష్టం అనిపించలేదు కానీ నిహాల్ని చూడగానే అతను నన్ను చాలా ఆకర్షించాడు అతడు చాలా నిజాయితీ వ్యక్తి అతను నాకు కావాలి అతడు ఎవరితో మిస్ బిహేవియర్ చేయలేడు అతన్ని నేను గత ఆరు నెలల నుండి అబ్జర్వ్ చేస్తున్న అతనితో స్నేహం కూడా చేస్తున్న కానీ నా యొక్క ప్రేమ అతనికి స్నేహంగా కనిపిస్తుంది కానీ నేను అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అతను నాకు అమెరికన ఇండియానా అనిపించడం లేదు అతడు నన్ను చాలా ఆకర్షించాడు అని ఆండ్రియా తన స్నేహితురాలితో చెప్పింది

నిహాల్ చాలా మంచి వ్యక్తి సరదాగా ఉండే వ్యక్తి కానీ నిహాల్ ఏ అమ్మాయి వెంబట పడడం ఇంతవరకు నేను చూడలేదు ఓకే కానీ అతడికి ప్రేమ అంటే ఇష్టం ఉందో లేదో మనకు తెలీదు కానీ నేను నిహాల్ ను గమనించింది ఏమిటంటే నిహాల్కు ఇవన్నీ ఇష్టం లేదు కావచ్చు కాని కానీ అతనికి నువ్వు ప్రపోజల్ చేయాలి లేకుంటే అతని అభిప్రాయం నీకు తెలియదు కదా.

ఆండ్రియా బదులిస్తూ నిజమే నా మనసులో చాలా ప్రేమ పెట్టుకున్నాను కానీ అతనికి నేను ఎప్పుడు స్నేహితురాలి గానే మాట్లాడాను కానీ అతడు నాకు ఏ రోజు ప్రేమ విషయాలు చెప్పేవాడు కాదు అతడు ఆలోచన విధానం నాకు తెలీదు కానీ నాకు అతడు కావాలి. నేను ప్రపోజల్ చేస్తా అతని సమాధానం అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోయింది ఆండ్రియా.

ఆండ్రియా నిహాల్ కు ప్రేమను తెలియజేయడం:

ఇలా చూస్తుండగా ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది నిహాల్ కు చదువులో రాణిస్తూ కాలాన్ని వెల్లదిస్తూ ఉన్నాడు

ఇదిలా ఉండగా ఆండ్రియా నిహల్ కు స్నేహితురాలిగా చాలా దగ్గరవుతూ ఉంది నిహాల్ కు తన ప్రేమ విషయం చెప్పాలని అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది.

ఇలా ఒక రోజు ఇద్దరు ఏకాంతంగా ఒక చెట్టు కింద కూర్చున్నారు అప్పుడు నిహాల్ కు ఆండ్రియా నెమ్మదిగా తన ప్రేమ విషయం చెబుతూ ఉంది.

నిహాల్ నీవు ఎవరినైనా ఇష్టపడ్డావా నేను ఎప్పుడూ చూడలేదు నీకు లవ్ చేయడం డేట్ చేయడం ఇష్టం లేదా అని నిహాల్ను ఆండ్రియా అడిగింది.

నిహాల్ నవ్వుతూ నేను మామూలుగా చదువుకోవడానికి తర్వాత ఉద్యోగం చేయడానికి నా ఊరు నుండి నా దేశం నుండి వచ్చాను నాకు ఇష్టం లేకపోవడం కాదు కానీ నాకు వీటి పైన అంత ఇష్టం లేదు నేను ఉద్యోగం చేసి కొన్ని రోజులకు ఇండియా క వెళ్తాను అక్కడనే ఉంటాను ఇది నా ఆలోచన అని ఆండ్రియా కు నిహాల్ చెప్పాడు.

ఆండ్రియా మనసులో చాలా కంగారు పడుతూ ఉంది నిహాల్ యొక్క సమాధానం చూసి కానీ మామూలుగా మళ్లీ కొన్ని ప్రశ్నలు అడిగింది

చాలామంది ఇండియన్స్ ఇక్కడ ఉద్యోగం వెతుక్కుని కుదిరితే ఇక్కడనే సెటిల్ అవ్వడానికి చూస్తారు కానీ నీవు చెప్పేది పూర్తిగా ఆపోజిట్ గా ఉంది నిహాల్ అని ఆండ్రియా చెప్పింది.

నిజమే కావచ్చు డాలర్ డ్రీమ్స్ తో ఇక్కడికి చదువుకోడనికి వచ్చి ఉద్యోగం సంపాదించి వెల్ సెటిల్ కావాలని మంచి పొజిషన్లో ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నాకు వీటిపైన అంత వ్యామోహం లేదు ఎందుకంటే నేను నా చిన్నప్పటినుండి గ్రామంలో బ్రతికాను అక్కడ చాలా అందమైన ఆకర్షణీయమైన ఆనందకరమైన క్షణాలు ఉంటాయి కష్ట సుఖాలు మధురానుభూతులు ఉంటాయి. నాకు అవి కావాలి మా తల్లిదండ్రుల ఆలోచనలను వారిని ఇబ్బంది పెట్టకూడదని ఇక్కడికి వచ్చాను మా ఆర్థిక పరిస్థితి పర్వాలేదు కానీ నాకు దీనిమీద అంత ఆసక్తి లేదు అందుకే కొన్ని రోజులు డబ్బులు సంపాదించి ఇండియాకి వెళ్తాను.

Beautiful Love story

నిహాల్ మాటలకు ఆండ్రియా చాలా ఆశ్చర్యపోయింది ఇతనికి ఎటువంటి అందరిలాంటి ఇష్టాలు లేవు అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని లేదు చాలా మంచి వ్యక్తి ఇతడు నా జీవితంలోకి వస్తే ఎంత బాగుంటుందో కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తి అసలైన ఆనందం రుచి చూసిన వ్యక్తి నాకు నా వాడైతే ఎంత బాగుంటుంది అని ఆండ్రియా మనసులో అనుకోని నెమ్మదిగా తన ప్రేమ విషయం నిహాల్కు చెప్పింది

నిహాల్ నీవు చెప్పిన అన్ని విషయాలు నేను విన్నాను కానీ నేనొక విషయం చెబుతాను నీవు వింటావా నిహాల్ నీవు మొదటగా క్యాంపస్ లోకి వచ్చాక నీ నీ గురించి నీవు చెప్పాక నిన్ను చూస్తే నేను చాలా ఆకర్షణకు లోనయ్యాను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిహాల్ నీకు నా ప్రేమ విషయం చెప్పాలంటే చాలా భయంగా ఉండేది కానీ నా మనసులో ఎన్ని రోజులు దాచుకున్న అది బయటపడేటట్టు లేదు ఇంకా వెయిట్ చేస్తే నీవు నాకు దక్కకుండా కొన్ని రోజులకు ఇండియాకు వెళ్లిపోతావు నా నన్ను ఒంటరి నీ చేస్తావు అందుకే ఇప్పుడు ధైర్యం చేసి నా ప్రేమ విషయం నీకు చెప్తున్నాను . నా ప్రేమను యాక్సెప్ట్ చెయ్ అని ఆండ్రియా నిహాల్కు ప్రపోజల్ చేసింది.

నిహాల్ కు ఆశ్చర్యం వేసింది:

ఆండ్రియా తన ప్రేమ విషయం చెప్పగానే నిహాల్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు మనసులో ఎన్నో ఆలోచనలు అక్కడి నుండి నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.

నిహాల్ నిశ్శబ్దంగా వెళ్లడం చూసి నేను అంటే నిహాల్కు ఇష్టం లేనట్టుంది అందుకే నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు అని దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుండి ఆండ్రియా వెళ్ళిపోయింది.

నిహాల్ తన మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడు నేను ఎవరికి ప్రపోజల్ చేయలేదు ఏ అమ్మాయిని ఇష్టపడలేదు కానీ ఆండ్రియా తన ప్రేమ విషయం చెప్పగానే నా మనసులో ఏదో అలజడి రేపింది . ఒక అమెరికన్ అమ్మాయి మరియు ఆమె చాలా అందమైనది. కానీ ఆమె నన్ను ఇష్టపడడం ఏంటి? ఇప్పటికీ నేను నమ్మకుండా ఉన్నాను కానీ ఇక్కడ ఇవి సహజం మనం ఒక అమ్మాయిని ఇష్టపడితే జీవితాంతం ఆమెతో ఉండాలి అని నా సిద్ధాంతం అని నా తల్లిదండ్రులను వారి మనసులను నొప్పించకుండా నేను అమెరికా వచ్చాను అలాగే కొన్ని రోజులు ఉద్యోగం చేసి వెళ్లిపోతా మళ్లీ ఆండ్రియా ఆమె చెప్పినప్పటినుండి నాకు ఆమె మీద ప్రేమ కలిగింది ఆమె చాలా అందమైన మంచి మనసు ఉన్న అమ్మాయి కానీ ఆండ్రియా అమెరికా అమ్మాయి మా తల్లిదండ్రులు ఆమెను ఒప్పుకుంటారా?

నాకు ఏదో కొన్ని రోజులు ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నా ఊరిలో నేను బ్రతుకుదాం అనుకుంటున్నా ఈమె మా ఇంటికి వస్తాదా! మా ఊరిలో ఉంటదా! నాతో పాటు వస్తదా రాదు ఎందుకంటే ఆమె న్యూయార్క్ సిటీలో పెరిగిన అమ్మాయి గ్రామంలో ఎలా ఉంటుంది ? మన ఆలోచనలను ఇతరుల పైకి రుద్దకూడదు. నా తల్లిదండ్రులను ఎలాగోలా ఒప్పిస్తాను కానీ నా నేను మనస్ఫూర్తిగా జీవించాలనుకుంటున్న నా ఆలోచనలకు ఇవి భంగం కలిగిస్తాయి కాబట్టి ఆండ్రియాకు నా ఆలోచనలను చెప్పను కానీ నాకు ఎటవంటి ఇష్టం లేదని చెబుతాను అనుకుంటూ ఒక రోజు ఆండ్రియాను కలిశాడు.

ఆండ్రియా నీవు చాలా అందమైన అమ్మాయివి. నీవు చాలా మంచి వ్యక్తివి కానీ నాకు ఇటువంటివి ఇష్టం లేదు నన్ను క్షమించు నాకు తెలియక నిన్ను బాధపెట్టి నన్ను ఇష్టపడేటట్టు చేసిన విషయాలు మరిచిపో నన్ను క్షమించు నా గురించి తప్పుగా అనుకోకు సారీ అని చెప్పి వెళ్లిపోయాడు.

ఆండ్రియా బాగోద్వేగం:

నిహాల్ ఆండ్రియా ప్రపోజలను రిజెక్టు చేశాడని అతను తనకు దక్కడని బాధపడుతూ నిహాల్కు ఆండ్రియా దూరం అవుతూ వచ్చింది.

ఇదిలా ఉండగా రెండు సంవత్సరాల మాస్టర్స్ మరియు రెండు సంవత్సరాల ఉద్యోగం కూడా చేస్తూ నిహాల్ వెళ్ళిపోతూ ఉంటాడు.ఒక సందర్భంలో ఆండ్రియా గురించి ఆలోచిస్తూ ఆండ్రియా నా గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటదా ! అనుకుంటూ ఆమె అమెరికన్ అమ్మాయి ఆమె నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది ?అనుకుంటూ రెండు సంవత్సరాలలో చాలా డబ్బులు సంపాదించి తల్లిదండ్రులకు తన ఆలోచన విధానం తెలియజేసి ఇంటికి వెళ్తాడు.

ఆండ్రియాకు నిహాల్ మెసేజ్ పంపాడు:

కొన్ని రోజుల తర్వాత ఆండ్రియాకు మెసేజ్ పంపాను ఆండ్రియా మనం చదువుకునే రోజుల్లో నీవు నన్ను ఇష్టపడ్డావు కానీ నా ఆలోచన విధానం నేను ఇండియాలోని నా ఊరిలో ఆనందంగా ఆహ్లాదకరంగా బ్రతకాలని నా ఆలోచన. నీవు నన్ను ప్రేమించడం నేను అదృష్టవంతుడిని నీవు చాలా అందమైన అమ్మాయివి మంచి వ్యక్తివి. కానీ నా యొక్క ఆత్మ సంతృప్తి చెందదు. కాబట్టి నీకు నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పాను వాస్తవానికి నా మనసులో ముందు ఏమీ ఆలోచనలు లేవు కానీ నీవు నీ ప్రేమ విషయం చెప్పాక ఇంత అందమైన ఆండ్రియా నన్ను ఇష్టపడిందా ?నేను ఇంత అదృష్టవంతుణ్ణి లేదా దురదృష్టవంతుడిన నేను ఇక్కడ ఉండే వాన్ని కాదు కదా నేను ఈమెతో బతకాలంటే నా యొక్క ఇష్టాలను వదులుకోవాలి .అని నేను అనుకోని రిజెక్ట్ చేశాను సారీ ఇప్పుడు నీవు ఎలా ఉన్నావ్ బాగున్నావా ఎవర్నైనా లవ్ చేసావా లేదా పెళ్లి చేసుకున్నావా నీ సమాధానం చెప్పు అని మెసేజ్ చేశాడు నిహాల్.

ఆ మెసేజ్ ను చూసి ఆండ్రియా నిహాల్కు సమాధానమిస్తూ నేను నిన్ను దాదాపు నాలుగు సంవత్సరాలుగా లవ్ చేస్తున్నాను కానీ నీ ఆలోచన విధానం నాకు తెలియజేస్తే నేను ఇంత బాధ పడే అమ్మాయిని కాదు కదా !నేను కూడా ఒక అమ్మాయి నా భావాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి .కానీ నీ మనసులోనే ఉంచుకున్నా ,నన్ను రిజెక్ట్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు నేను చాలా బాధపడుతూ ఉన్నాను నన్ను నిహాల్ కాదన్నాడు నా ఆలోచన నన్ను నిహాల్ కాదన్నాడు ఇదే నా ఆలోచన . నేను అమెరికా అమ్మాయినే కావచ్చు కానీ నేను కూడా ఒక అమ్మాయిని నా మనసులో నిన్ను ఆరాధించాను నిన్ను ఇష్టపడ్డాను నీవు నాకు కావాలి అనుకున్నాను నిన్ను నేను నిజాయితీగా ప్రేమించాను .కానీ నీవు నన్ను కాదన్నా విషయం అదే నా బాధ ,నేను వేరొక అబ్బాయిని మళ్లీ ప్రేమించలేదు నేను ప్రస్తుతానికి ఒక జాబ్ చేస్తూ ఉన్నాను అని నిహాల్ కు పెద్ద మెసేజ్ ని పంపింది

నిహాల్ కంటిలో నీళ్లు తిరిగాయి:

ఆ మెసేజ్ ను చూసిన నిహాల్ తీవ్రమైన బాగోద్వేగానికి లోనవుతాడు. ఆండ్రియాను నేను చాలా బాధపెట్టాను ఆండ్రియా ఒక అమెరికన్ అమ్మాయి ఇవన్నీ సర్వసాధారణం అనుకుంటుంది అనుకున్నా. నా యొక్క స్వార్థం ఆమె నాతో ఉండదు అనుకున్న కానీ ఆ అమ్మాయి చెప్పిన ఈ విషయాలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి .ఇంత మంచి అమ్మాయిని నేను వదులుకున్నానా అని నేను బాధపడుతున్నాను. ఇక తప్పు చేయకూడదు ఆండ్రియాకు స్వారీ చెప్పాలి అని నిహాల్ ఆండ్రియాకు మెసేజ్ పంపాడు

స్వారీ నన్ను క్షమించు నీ ప్రేమను నేను తిరస్కరించలేదు నా మనసులో నాకు అంత అదృష్టం లేదు నా ఆలోచనలను నా ఇష్టాలను చంపకోలేక నీకు నా ఆలోచన విధానం నీకు తెలియజేయలేదు అది నేను చేసిన తప్పు .ఇంకా నాలుగు సంవత్సరాలు అయినా నీలో ఎటువంటి మార్పు లేదు నీవు నిజాయితీగా నన్ను ప్రేమించావు నేను అదృష్టవంతుణ్ణి కాను ఎందుకంటే నిన్ను నేను చాలా బాధ పెట్టాను నావల్ల ఎవరు బాధపడ్డా నేను బాధపడే వ్యక్తిని ,కానీ నన్ను ఇష్టపడి నువ్వు చాలా బాధపడ్డావు.

మామూలుగా అమ్మాయి లాగే నీవు అనుకున్న నన్ను క్షమించు నిన్ను నేను నా గుండెల్లో నేను చనిపోయే వరకు దాచుకుంట నాకు ఒక అవకాశం ఇవ్వు ఆండ్రియా అంటూ మెసేజ్ పంపాడు నిహాల్.

అమ్మానాన్నలకు విషయం తెలియజేసిన నిహాల్:

నిహాల్ వారి తల్లిదండ్రులకు చెబుతూ అమ్మానాన్న నేను చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి అది కూడా అమెరికన్ అమ్మాయి నన్ను చాలా ఇష్టపడ్డది. కానీ నేను ఆమెను రిజెక్ట్ చేశాను నాకు ఇక్కడ ఉండడం ఇష్టమని ఆమె నాతో బతకలేదు అని నేను అనుకున్నా కానీ ఆమె ఇప్పటికే అదే ఆలోచన విధానంతో ఉంది ఆమెను క్షమించమని కోరా ఆమెతో బతకాలని ఉంది అమ్మా నాన్న మీ యొక్క స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటాను చెప్పండి అంటూ చెప్పాడు నిహాల్

తల్లిదండ్రులు కూడా నిహాల్ చెప్పిన విషయాలను కాదనలేదు సరే నీకు ఇష్టమైతే ఆమెను పెళ్లి చేసుకో మాకు ఇష్టమే నాన్న అంటూ తల్లిదండ్రులు నిహాల్కు చెప్పారు.

ఆండ్రియా ఇండియాకి రావడం:

నిహాల్ మెసేజ్ ను చూసి ఆండ్రియా చాలా ఆనందపడుతూ కంటిలో నీళ్లు తిరుగుతూ వెంటనే ఇండియాకు వెళ్ళింది

నిహాల్ ఆండ్రియా కోసం ఎదురుచూస్తూ ఎయిర్ పోర్ట్ లో ఉన్నాడు ఇంతలో ఆండ్రియా ఎయిర్ ర్ట్ బయట నుండి వచ్చేసింది నిహాల్ దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలించుకుంది ఏడుస్తూ ఉంది కంటిలో నుండి నీళ్లు కారుతూనే ఉన్నా నీ హాల్ కూడా చాలా బాధపడుతూ సంతోషపడుతూ కంట్లోని నీళ్లను తుడుచుకుంటూ వెళ్లారు. నిహాల్ తల్లిదండ్రులు సంతోషంతో ఆహ్వానించారు తమ అమ్మ నాన్నతో మాట్లాడాలని ఆండ్రియాకు చెప్పారు .ఆండ్రియా కూడా తమ తల్లిదండ్రులని ఒప్పించింది

నిహాల్ మరియు ఆండ్రియా కలిసి జీవించడం:

నిహాల్ కు ఆండ్రియాకు పెద్దలు పెళ్లి చేశారు ఆండ్రియా చాలా ఆనందంగా ఉంది .గ్రామంలో ఎంత ఆనందంగా ఉంది పచ్చని పొలాలు ఈ పచ్చని ప్రకృతికి దూరం కాకూడదని, అందుకే అప్పుడు నా ప్రేమను రిజెక్ట్ చేశాడు. నేను కూడా ఎంత అందమైన ఇంత సంతోషకరమైన కుటుంబ బాంధవ్యాలు, ఇటువంటి వాతావరణం నాకు కావాలి .సంతోషంగా నిహాల్ తొ జీవిస్తాను అని అనుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంది ఆండ్రియా.

Latest Stories

Leave a Comment