ఈ ప్రపంచంలో నిరంతరం శ్రమించే వ్యక్తి శ్రామికుడు .తన జీవితంలో తన కుటుంబం కోసం ఎంతో కష్టపడతాడు కానీ అందులో ఒక ఐదు శాతం లాభాన్ని కూడా శ్రామికుడు పొందలేకపోతున్నాడు. ఎందుకు ?శ్రామికుడు శ్రామికుడుగా అని మిగిలిపోతున్నాడు.
శ్రామికుడు అద్భుతాలు చేస్తాడా?
శ్రామికుడు ఎలా అద్భుతాలు చేస్తాడు ? కానీ అద్భుతాలు శ్రామికుడే చేస్తాడు. ఎలాంటి ఒక అద్భుతమైన కట్టడం కట్టడానికి శ్రామికుడు యొక్క శ్రమనే ఆధారపడుతుంది. ఆ కట్టడం గానీ ఆ నిర్మాణంగానే మనకు చూడటానికి అందంగా సంతోషంగా కనిపిస్తుంది కానీ ఆ నిర్మాణాల వెనుక ఎంతో శ్రమ ఆధారపడి ఉంది శ్రామికుడు లేనిదే ఈ ప్రపంచ అభివృద్ధి జరగదు కానీ ఆ శ్రామికుల్ని ఎల్లప్పుడూ ఈ సమాజం మోసం చేస్తుంది వెట్టి చాకిరి చేపిస్తుంది.
రైతు ఒక శ్రామికుడు
రైతు ఎల్లప్పుడూ కష్టపడే ఒక శ్రమజీవి . రైతు కష్టపడితేనే మనకు ఆహారం ఆశ్రయం సదుపాయాలు అన్నీ కలుగుతాయి .రైతు ఎంతో కష్టపడి పంటలను పండిస్తాడు అవి ఎవరు తింటారు ఈ సమాజం కానీ ఆ పంటలకు సరైన ధర లేక రైతు ఎప్పుడు కష్టపడుతూ ఇబ్బందులు పడుతూ ఉంటాడు సరైన ధరలు లేక తనువులు చాలుస్తున్నారు. మన కర్షకులు కాబట్టి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వండి. ఎందుకంటే రైతుల శ్రమను గుర్తించండి వారు బాగుంటేనే మనం బాగుంటాం వారు బాగు లేకుంటే ఈ పంటలను ఎవరు పండించరు ఆర్టిఫిషియల్ గా పంటలు పండించి మనం తినగలమా అది సాధ్యమవుతుందా ఒక రకమైన ఇంజక్షన్లు వేసుకుని ఆహారం తినకుండా సరిపోతుందా ఆలోచించండి.
ఒక నిర్మాణ కార్మికుడు:
మనకు కనిపించే అందమైన భవంతులు ఆకాశాన్ని తాకే నిర్మాణాలు ఒక కార్మికుడు వలెనే సాధ్యమవుతాయి. తమ ప్రాణాలు లెక్కచేయకుండా రేయింబవళ్లు కష్టపడుతూ ఎంతో అద్భుతమైన నిర్మాణాలు ఆశ్చర్యంగా కనిపించే నిర్మాణాలు మనకు అందిస్తున్నారు వారు ప్రాణాలకు తెగించి అంత ఎత్తు నిర్మాణాలు చేస్తున్నారు శ్రామికులు శ్రామికులను గౌరవించండి వారికి తగ్గ సదుపాయాలను కల్పించండి ఎప్పుడు శ్రమదోపిడి చేయకండి.
సమాజంలో శ్రామికుల పట్ల రావలసిన మార్పులు: