Great farmer-గొప్ప రైతు 2025

మనం తినే ప్రతి ఆహారం రైతు పండించింది. రైతు ఆరు కలం కష్టపడి తన యొక్క తన పంటను పెంపొందించుకొని రైతు అమ్ముకుంటాడు రైతు ఎంత కష్టపడతాడంటే రోజు మొత్తంలో ఒక నిద్రబోయే సమయం తప్ప మిగతా సమయం మొత్తం తన వ్యవసాయ పొలంలోని సేద తీరుతూ పనులను చేస్తూ మునుముందుకు సాగుతాడు ఇదే రైతు జీవితం తన కష్టం తన ఫలం మొత్తం ఆ యొక్క భూమిపైనే నమ్ముకున్న భూమిపుత్రుడు మన రైతు.

రైతు ఎప్పుడు అభివృద్ధి చెందుతాడు:

రైతు ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకుని సరైన ధరకు పొందే హక్కు రైతులు కోల్పోతున్నాడు. తినే ఆహారం కు ఈ ప్రపంచంలో ఎంతో డిమాండ్ ఉంది కానీ దానికి ఎంతో కష్టపడ్డా, రైతు ఆరుకాలం శ్రమించిన రైతుకు అందించే సహాయం మాత్రం తక్కువగా ఉంది .రైతు తన పంటను సరైన ధరకు అమ్ముకోలేక ఎంతో అవస్థలు పడతాడు. ప్రభుత్వం రైతులకు విద్యుత్తు నీరు ఉచితంగా అందించిన రైతుకు సరైన ధర లేక పోతే అది లాభం లేదు.

దళారుల చేతుల్లో ఎప్పుడు మోసపోయే రైతు:

ఆరుకాలం కష్టపడి పండించిన పంటకు సరైన ధరలు లేక ఎంతో కష్టపడి ఆ పంటను పండించి అమ్ముకునే పరిస్థితి లేక తక్కువకే ధర లేదు, అని చెప్పి తక్కువ ధరకు రైతు మోసం చేస్తూ వ్యాపారులు దళారులు లాభపడుతున్నారు .కానీ రైతుకు సరైన న్యాయం జరుగుతలేదు.

ఒక బిజినెస్ మాన్ తన ప్రోడక్ట్ కు ప్రైస్ ను నిర్ణయిస్తాడు కానీ రైతు తన పంటకు ప్రైస్ ని నిర్ణయించలేడు.

ఒక బిజినెస్ మాన్ తనకుక కురుకురే ఫ్యాక్టరీఉందనుకోండి లేదా చక్కెర గాని పప్పు ధాన్యాలు గాని ఇంకా ఎటువంటి వస్తువులైన ఇంకా ఏమైనా ఎన్నో వస్తువులు వాటిపైన ఒక 50 గ్రాములకు ఐదు రూపాయలు తీసుకుని హక్కుని బిజినెస్ మాన్ పొందుతున్నారు కానీ ఆ వస్తువుకు వచ్చే ధర రైతు ఒక 30% కూడా రాదు ఎందుకు? ఆరు నెలలు పండించిన రైతుకు సరైన ధర రాదు, కానీ ఒక వారంలో ప్రాసెసింగ్ చేసిన అంటే అందులో ఏమైనా రాయిలు, లాంటివి ఉంటే తీసేసి ఒక కవర్లో పెట్టి ఆ కవర్ ఆ పాకెట్ కు రేటును నిర్ణయించే అధికారం బిజినెస్ మాన్ కు ఉంటది ఒక వారం పనికి దానికి అంత రేటు వస్తుంది కానీ రైతు ఆరు నెలలు కష్టపడ్డా ఆ పంటకు ఇచ్చే రేటు ఎంతో తక్కువ.

రైతు పంటకు సరైన మద్దతు ధర ప్రభుత్వాలు ఎందుకు కల్పించడం లేదు?

ప్రభుత్వానికి మద్దతు ధర ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు కానీ మద్దతు ధర ఇస్తే ధరలకు రెక్కలొస్తాయి సామాన్యుడికి అందుబాటులో పప్పు ధాన్యాలు కూరగాయలు బియ్యము ఎటువంటివి కొనుక్కుని పరిస్థితుల్లో ఉండరు కాబట్టి ఎవరో ఒకరు నష్టపోవాల కదా అందుకే రైతుని ప్రభుత్వాలు ముంచుతున్నాయి .

నష్టపోతున్నామని తెలిసినా కష్టపడి పంటను పండించే వాడే రైతు.

కష్టపడి పండించిన పంటకు సరైన మద్దతు ధర లేక దళారుల చేతుల్లో రైతు ఎప్పుడు మోసపోతూనే ఉంటున్నాడు. రైతుల్ని ప్రభుత్వాలు ఎంతో కొంత వరకు ఆదుకుంటున్నా పూర్తిగా రైతులకు న్యాయం జరుగుతలేదు ఎందుకు ప్రస్తుత ప్రపంచంలో ఆహారానికి అన్నింటికీ డిమాండ్ ఉన్న రైతు పండించిన పంటకు డిమాండ్ లేదు మరి మనుషులు తినే ఆహారం బిజినెస్మేన్లు చేసిందా రైతు కష్టపడి పండించిందా అని ప్రభుత్వాలు ఆలోచించాలి. సరైన ధరలు లేక పండించిన పంట సరిగా రాక అప్పుల పాలవుతూ రైతులు తనువు చాలిస్తున్నారు ఈ శోకం ఎవరిది ప్రభుత్వానిదా సమాజానిదా వ్యాపారులదా

రైతులు బాగుపడాలంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు:

ప్రభుత్వాలు లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టిన సామాన్య రైతుకు మద్దతు ధర లేకుంటే రైతుకు లాభం లేదు.

కాబట్టి పంట వేసి ముందు సరైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ సందర్భంలో తక్కువ రేటు ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ప్రభుత్వం గోదాముల్లో నిల్వ చేయాలి. సరైన ధరకు ప్రభుత్వం అమ్ముకోవాలి రైతుకు దానిలో పర్సంటేజ్ ఇవ్వాలి రైతు బాగుకు ప్రభుత్వం పని చేయాలి.

సమాజంలో ఉన్న రేటుకు రైతుకు 15% ప్రాసెసింగ్ యూనిట్కు కట్టిస్తే సరిపోతుంది మిగిలిన 85% రైతుకు ధర కల్పిస్తే రైతు బాగుపడతాడు.

ప్రైవేటు, వ్యాపారస్తుల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వమే పంటను కొనుగోలు చేయాలి ఉద్యోగ అవకాశాలు కూడా ఎంతో పెరుగుతాయి రైతు పంటకు మనం తినే ఫుడ్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటది కానీ ఆ ప్రతిఫలం రైతుకు అందడం లేదు కాబట్టి ప్రభుత్వమే సరైన మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.

రైతుకు మద్దతు ధర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న అవి చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం దాదాపు 15% అప్పుడు ప్రకటించిన మద్దతు ధరకు యాడ్ చేయాలి అప్పుడే ప్రతి సంవత్సరంకు అభివృద్ధి ఉంటుంది కాబట్టి దీర్ఘకాలిక పంటలకు ఎప్పుడు మద్దతు ధర ప్రకటిస్తూ ఉండాలి అప్పుడే రైతు ధైర్యంగా ప్రతి సంవత్సరం 15% పంట ధర అభివృద్ధి చెందుతుంది మంచి దిగుబడి వస్తుంది అని రైతు నమ్మకంతో పంటను పండిస్తాడు రైతు కోరిక న్యాయమైంది.అని ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 15% మద్దతు ధర ఎక్స్ట్రానే కోరుకుంటున్నాడు కానీ అంతకంటే ఎక్కువ రైతు ఇవ్వకున్నా పర్వాలేదుకాని ప్రభుత్వం దయచేసి మద్దతు ధర ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్న దానికి అదనంగా 15 నుండి 20% ప్రకటించాలి.

మధ్యలో ప్రైవేట్ భాగస్వామ్యం లేకుండా రైతుకు పంట ధరనుకొని సమాజానికి అమ్మడం వల్ల ప్రభుత్వానికి లాభం కలుగుతుంది సామాన్య ప్రజలకు కూడా ధరలు అందుబాటులో ఉంటాయి కాబట్టి రైతులకు ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం పూర్తిస్థాయి దృష్టి రైతుల పండించిన పంటలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి సరైన ధర అందిస్తే అంతకుమించినా లాభం రైతుకు లేదు సామాన్యులు బాగుపడతారు ప్రభుత్వం కి నిరుద్యోగ సమస్య తీరుతుంది అందరూ సంతోషంగా ఉంటారు.

రైతులకు ప్రోత్సాహకం ఉండాలి రైతులు పండించే పంటలకు రసాయన ఎరువులు వాడకుండా ఆ ఎరువులని నిషేధించాలి రసాయనిక మందులు ప్రజలకు ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం రసాయనిక మందులను నిషేధించాలి ఆర్గానిక్ మందులను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించాలి అభివృద్ధి చెందించాలి ఇది సమాజా ఆరోగ్యానికి మంచిది.

Latest Stories

Leave a Comment