Human relationship -మానవ సంబంధాలు2025:

ఆధునిక కాలంలో మనుషుల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తూ ఉన్నాయి. ఇది సమాజానికి అంతా మంచి విషయం కాదు .ఎందుకంటే మనం జంతువుల నుంచి విభేదించి, తెలివితేటలతో స్పృహ కలిగిన మనిషి మానవుడు. మంచి చెడులు ఎమోషన్స్ అన్ని రకాల భావాలు మనిషి యొక్క జీవితంలో ఒక భాగం కానీ, మనుషుల మధ్య సంబంధాలు అనేక కారణాలవల్ల ప్రతిరోజు దిగజారుతూ ఉన్నాయి. ప్రతిరోజు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం.

మనుషుల మధ్య సంబంధాలు క్షీణించడానికి కొన్ని,రకాల కారణాలు మనం చెప్పవచ్చు. కానీ ప్రధానంగా కొన్ని కారణాలను మనం ఇక్కడ చూద్దాం.

ఇందులో అత్యంత ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకుందాం ఇవే ప్రధానంగా మనుషులు సంబంధాలు నశించడానికి కారణాలు:

స్వార్థం:

ఈ సమాజంలో ప్రతి మనిషికి తనకంటూ స్వార్థం ఉంటుంది. కానీ ఏ స్వార్థం లేకుండా ఎవరు బ్రతకలేరు కానీ, ఇది చాలా సందర్భాల్లో స్వార్థం అనేక రకమైన సంబంధాలు. చెడిపోవడానికి కారణం అవుతుంది.

స్వార్థం రకాలు

కుటుంబ సంబంధ స్వార్ధాలు:

సహితుకమైన స్వార్థం: ఇటువంటి స్వార్థం మంచిది. ఎందుకంటే తన ఫ్యామిలీని పట్టించుకోవడానికి ,భార్యా,భర్తలను పట్టించుకోవడానికి మరి పిల్లల్ని ,పట్టించుకోవడానికి కుటుంబ సభ్యులను పట్టించుకోవడానికి , ఇది అవసరం ఇది లేకుంటే ఎవర్ని ఎవరు పట్టించుకోరు చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారు .దీనివల్ల కుటుంబం వ్యవస్థ నాశనం బలపడుతుంది.కాబట్టి ఇటువంటి మంచి సంబంధం కలిగిన స్వార్థం అవసరం

అసహేతుకమైన స్వార్థం:

ఇటువంటి స్వార్థం సమాజానికి ఉపయోగకరం కాదు. ఇది సమాజ సంబంధాలు , సంబంధాలు నశించడానికి కారణం అవుతుంది కాబట్టి ఇది సమాజానికి మంచిది కాదు.

డబ్బు:

ప్రస్తుత ఆధునిక ప్రపంచం డబ్బుతోనే నడుస్తుంది. ప్రతి పనికి డబ్బు కావాలి విలాసవంతంగా జీవించడానికి డబ్బు కావాలి. స్వార్థానికి కూడా డబ్బే అవసరమవుతుంది. అన్న తమ్ముడు అమ్మానాన్నలు స్నేహితుల మధ్య సంబంధాలు నశించడానికి, కారణమవుతుంది. స్వార్థం వల్ల తన స్వార్థ వల్ల తనకే కావాలి మిగతా వారికి చెందకూడదు. డబ్బు ఆశ వల్ల ఈ స్వార్థం మరింత కఠినమై ఎన్నో దుర్మార్గాలు చేయడానికి కారణం అవుతుంది.

మనం చూసే దానిలో మంచి ఉంటది. చెడు ఉంటది మనకు ఏది నచ్చుతుందో ఏది ధర్మబద్ధంగా ఉంటుందో, దాన్ని మనం పాటించాలి. అధర్మాబద్ధంగా ఉండే దాని తీసివేయాలి.

డబ్బు అవసరాన్ని మనకు ఎంతవరకు అవసరమవుతుందో అంతే వరకు వాడాలి. అంతకుమించి మనము వాడితే అది సంబంధాలు నశించడానికి కారణం అవుతుంది.

డబ్బు లేపకపోతే ఇల్లు గడవడానికి కష్టం. డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు నిజాయితీగా కష్టపడి సంపాదించాలి .మన పిల్లల్ని మంచిగా చదివించుకోవడానికి వారి భవిష్యత్తును నిర్మించడానికి డబ్బు కావాలి .కానీ ఆ డబ్బు కోసం స్వార్థం వెతకడం కూడా సరైనది కాదు. దీని వల్లనే డబ్బు స్వార్థం వలనే కుటుంబ సంబంధాలు నశించి ఎన్నో గొడవలు కారణమై మాట్లాడుకోకుండా ఒక సందర్భంలో హత్య లు కూడా చేస్తున్నారు, నేటి సమాజంలోని మనుషులు.

సేవనిరతినిపెంచుకోవాలి మనకున్న దాంట్లో కొద్దో గొప్పో,ఎవరికైనా సహాయం చేయాలి ,ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలి మనకు తోచిన సహాయం చేయాలి.

సమాజానికి ఉపయోగపడే తనకు ఉపయోగపడే ఆరోగ్యకరమైన అలవాటను అలవాటు చేసుకోవాలి.

ప్రేమ సంబంధిత సంబంధాలు:

ప్రేమలో నిజాయితీ ఉంటే జీవితాంతం సంతోషంగా జీవితం సాగించవచ్చు. కానీ ప్రేమలో నిజాయితీకి లేకుంటే స్వార్థం పెరిగి హత్యలకు దారితీయవచ్చు.

భార్యాభర్తల మధ్య సంబంధాలు:

ఒక స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు ఒక వివాహ బంధంతో ఒకటవుతారు. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు వచ్చినా ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ సర్దుకుపోవాలి కుటుంబ సభ్యులందరితొ కలిసిమెలిసి ఉండాలి అది మంచి సంబంధాలు బలపడానికి కారణం అవుతాయి.

వివహేతర సంబంధాలు:

కుటుంబ వ్యవస్థ నాశనం అవడానికి కారణం వివాహేతర సంబంధాలు. ఇవి సమాజాన్ని, కుటుంబాన్ని నాశనం చేయడానికి కారణం అవుతుంది ఇటువంటి సంబంధం.

ఇది ఒక మహిళ కావచ్చు ఒక పురుషుడు కావచ్చు, వారికి పిల్లలు కూడా ఉండవచ్చు .భార్యాభర్తలు కాకుండా ఒకరికి తెలియకుండా,ఇంకొకరితో సంబంధం కొనసాగించడానికి వివేహితర సంబంధం అంటారు

ఇది సమాజానికి మంచి విషయం నేర్పదు

కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది

మంచి చెడులు తెలియకుండా పోతాయి

హత్యలు చేయడానికి దారితీస్తాయి

పిల్లలు అనాధలుగా మిగిలిపోతారు దీనివల్ల

ఇది సమాజానికి తీవ్రమైంది.

Latest Stories

Leave a Comment