ప్రతి ఇంటికి ఆధారం , ఆ కుటుంబాలకు రక్షక కవచం, కుటుంబాలకు ధర్యం నీవే నాన్న – బాపు .
ప్రతి కుటుంబం లో నాన్న ఉంటాడు, తల్లి జన్మను ఇస్తే, తండ్రి ఇంటికి ఆధారాన్ని, బ్రతికే ఆధారాన్ని ఇస్తాడు
నాన్న కు పర్యాయ పదం :
నాన్న కు పర్యాయపదం , ఎన్నో ఉంటాయి కానీ , నా ఆత్మీయ పర్యాయ పదం బాపు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నీవు మరణించే వరకు బాపు, బాపు అని అన్నాను. నీ విలువ ఎంత తెలిసిన , ఇక నువ్వు లేవు అని అంటే, తట్టుకోలేక పోతున్న బాపు.
బాపు నీకు చదువు రాదు కానీ నీవు చేసిన పనులు గొప్పవి
బాపు నీకు చదువు రాదు, కానీ పని పైన నీ శ్రద్ధ అమోఘం. నీవు చిన్న వయస్సులో విదేశాలకు వెళ్లి ,నీ వయస్సు ను అప్పగించవు, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు.
బాపు నీ కష్టం మాకు ఎంతో అర్థమైంది , నిన్ను బాగా చూసు కోవాలన్న , ఆకాంక్ష ఉన్న ఇప్పుడు నీవు లేవు.
తండ్రి బాధ్యత చాల గొప్పది.
ప్రతి కుటుంబాలకు తమ తండ్రి హీరో గా ఉంటాడు. ఎన్ని బాధలు ఉన్న తనలో దాచు కుంటాడు. తన ప్రేమ ను బటపెట్టడు .
బాపు నీ పిల్లలకు రెక్కలు వచ్చాయని వెళ్లి పోయావా:
బాపు నీకు చదువు రాకున్నా, మాకు చదువు చెప్పించావు, మాకు అన్ని సదుపాయాలు కాల్పించావు . కానీ మేము నీకు సేవ చేయాలనుకునే సమయంలో నీవు లేవు. బాపు నీ యాదిలో ఎప్పుడు ఉంటాము .