A precious life విలువైన జీవితం:
మనిషి జీవితం చాలా విలువైనది, మనం జన్మించాము,మనకు ఒక పుట్టుక ఉంది. ఈ జీవితం లో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ చిన్న చిన్న విషయాలకే ఎంతో మంది మరణిస్తున్నారు ?

మనకు మళ్ళీ జన్మ ఉంటుందా ?
మనం ఈ జన్మను తీసుకున్నాం, అనుభవించాలి . కానీ ఆత్మ హత్య చేసుకోవడం వలన , నువ్వు లేకుండా పోతే ఎంకేముంటుంది.కానీ , ఎన్ని బాధలు ఉన్న ,నిలబడటానికి మనం ప్రయత్నించాలి అది జీవితం.
మరణం కంటే పెద్ద ది జీవితం లో ఉంటుందా ?
నీ పుట్టుకతో జీవితాన్నీ మొదలు పెట్టి , మరణించే వరకు ఈ జీవితం సాగాలి. మధ్యలోనే ఈ జీవితాన్ని విడువడం ఎంతవరకు సమంజసం. కాబట్టి ఎన్ని కష్టాలు ఉన్న మరణం కంటే చిన్నవి .
కష్టాలు కల కాలం ఉండవు
Be strong ఎప్పుడు బలంగా ఉండాలి:
చిన్న చిన్న విషయాలకు బాధపడటం సరైనది కాదు, బాధలు,కష్టాలు వాస్తు ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఆ కష్టాలను దాటే మార్గాన్ని వెతకాలి.

Types of adversity- కష్టాలు రకాలు:
చాల మంది చెబుతుంటారు మాకు ఉన్న కష్టాలు మీకు ఏం తెలుసు అని, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు మొదలగునవి.
ఎన్ని కష్టాలు ఉన్న ఆత్మహత్య ముందు ఇవి అన్ని చిన్నవి, నీ జీవతం నీకు చాల ముఖయమైనది.
Family is important – కుటుంబం మనకు ముఖ్యమైనది:
చాలా మంది విద్యార్థులు,యువకులు తాము ఎగ్జామ్స్ బాగా రాయలేమని, మీరు అనుకున్న దాన్ని సమర్థవంతంగా చేయలే మని కుటుంబాలను శోకసంద్రంలో ఉంచి వెళ్లి పోతారు,కానీ ఆ జ్ఞాపకాలు వారు మరణించే వరకు ఉంటాయి మీ యొక్క కుటుoబాలకు.
ఆత్మహత్య ను నివారించే మార్గాలు:
1.కష్టం ఎంత పెద్దదైనా అది మరణం కంటే చిన్నది గా భావించాలి.
2.మనకు మనం తక్కువ అంచనా ఎప్పుడు చేసుకోవద్దు .
3.జీవితంలో ఏదీ వచ్చిన, రాక పోయినా స్థిరత్వం ఉండాలి.
4.మన కుటుంబాలను గురించి ఆలోచించాలి.
5.అద్భుతమైన పుస్తకాలను చదవాలి .
6.ఒంటరిగా ఉండడం మానేసి, నలుగురితో మెలగడం అలవాటు చేసుకోవాలి.
7.స్ఫూర్తి వంతమైన వాక్యాలను చదవాలి.
8.పరువు పోయింది అని భావన ఉండకూడదు. క్షణిక ఆవేశం సరైనది కాదు.
9.అన్నిటికంటే ముఖ్యంగా ధర్యంగా ఉండాలి.
10. ఓర్పు ఎంతో అవసరం
ఇవి మాత్రమే కాదు ఇంకాకొన్ని ముఖ్యవిషయాలను వివరిద్దం.
పుస్తకాలను చదవడం :
పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా భగవత్ గీత, స్వామి వివేకానంద, పుస్తకాలను చదవాలి.

“నదిలోకి కొత్త నీరు వచ్చి పాత నీరు ఎలా వెళ్లి పోతుందో అలాగే కష్టాలు,సుఖాలు వచ్చి వెళ్తుంటాయి”

“బలమే జీవనం బల హీనతే మరణం” – స్వామి వివేకానంద

సింహాల లాగ బతుకండి గొఱ్ఱెలవలె కాదు
