ప్రతి మనిషికి జీవితానికి ,సమయం చాలా ముఖ్యమైంది.ఈ సమయంలో సాధించింది రేపటి జీవితానికి పునాదిగా ముఖ్యమైనదిగా ఉంటుంది.
సమయం-time:
సమయానికి మరొక పేరు కాలం అనేది నీటి ప్రవాహం లాంటిది .అది ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్లిన కాలం వెళ్ళిన టైం మనకు మళ్ళీ రాదు. ఉన్న సమయంలో నే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోవాలి. సమయం అయిపోయాక మన యొక్క ప్రణాళిక సఫలం కాదు. కాబట్టి సమయం విలువ తెలుసుకొని మెలగాలి .సమయం చాలా ముఖ్యమైనది ఈ సమయం విలువ తెలిసిన వ్యక్తి జీవితంలో ఉన్నతంగా స్థిరపడతాడు. దానికి తగ్గట్టు ప్రణాళికలు జీవితాన్ని ముందుకు సాగించాలి.

గడిచిన కాలం తిరిగి రాదు :
కాలం అనేది నీటి ప్రవాహం లాంటిది ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటుంది
.ఎ పని చేసిన ఉన్న సమయంలోనే పూర్తి చేయడానికి శతవిధాల ప్రయత్నం చేయాలి
. సమయం గడిచిపోయాక ఆలోచిస్తే ఏం లాభం ఉంటుంది ఏమీ లాభం ఉండదు కాబట్టి సమయం ఉన్నప్పుడే మన యొక్క లక్ష్యాన్ని పూర్తి చేయాలి పూర్తి చేయకుంటే మనం గడిచిన సమయం గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధపడుతూ ఉంటాం.
. ఉదాహరణకు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం వేచి చూస్తున్నారు మదన పడుతున్నారు చాలా కష్టపడుతున్నారు కానీ ఒకని ఒక సందర్భంలో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు దానికి దాదాపు ఒక మూడు నెలలు ఈ మూడు నెలల లోపల మనం విజయం సాధించాలి పోస్ట్లు చాలా తక్కువగా ఉన్నాయి మొత్తం పోస్టులు దాదాపు ఒక వెయ్యి కానీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారు దాదాపు ఒక లక్ష మంది ఈ వెయ్యి పోస్టులలో మనకు ఒక ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాలి కాబట్టి సమయం లోనే మనకున్న ఆ మూడు నెలల సమయంలోనే మనం చాలా కష్టపడి సమయస్ఫూర్తితో తెలివితేటలతో పక్కా ప్రణాళికతో మన యొక్క లక్ష్యాన్ని సాధించాలి ఇక్కడ సమయం విలువ మనకు తెలుస్తుంది.
మారక ఉదాహరణను ఇక్కడ చూద్దాం అతనికొక భార్య ఆమె ఎప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటారు కానీ ఒకని ఒక సందర్భంలో ఆమెకు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ ఆమెకు ఆ విషయం తెలీదు ఎందుకంటే కాయ కష్టం చేసుకునే పేదవారు వారు వారు చిన్న చిన్న నలతలకు ఆసుపత్రులకు వెళ్లారు పేదవారు అయితే ఒక నొ సందర్భంలో తీవ్రమైన దగ్గు వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే స్కానింగ్ తీయాలి అమ్మ అన్నారు కానీ సార్ మా దగ్గర అంత డబ్బు లేదు సార్ మేము మళ్ళీ వస్తాము ప్రస్తుతానికి టాబ్లెట్లు రాసి ఇవ్వండి సార్ అని భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు డాక్టర్ చెప్పారు అమ్మ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు సరే మరి కానీ సమయం నుంచి పోకుండా చూడండి దాదాపు ఒక వారంలో మీరు స్కానింగ్ కచ్చితంగా తీసుకోవాలమ్మా అని చెప్పారు. అందుకు భార్యాభర్తలు ఇద్దరు సరే అని చెప్పి వన్ వీక్ కాదు వన్ మంత్ అయిపోయిన వారు రాలేరు.
తర్వాత ఆమె వల్ల కాక ఆసుపత్రికి కచ్చితంగా వెళ్లాలని భర్తకు చెప్పింది అందుకు తగ్గట్టు డబ్బులు సిద్ధం చేసుకుని వెళ్లారు కానీ ఆస్పత్రికి వెళ్ళినంక డాక్టర్ గారు ఏమమ్మా నేనేం చెప్పాను దాదాపు ఒక వన్ వీక్ లో రమ్మన్నాను కానీ మీరు వన్ మంత్ అయినా రాలేదు ఎందుకమ్మా ఆరోగ్యం పైన అంత పట్టించుకోకుండా ఉంటే తప్పు అని డాక్టర్ చెప్పారు అందుకు ఆమె సార్ నాకు రావాలనే ఉంది కానీ మా దగ్గర అంతా డబ్బు లేక మేము రాలేము కొన్ని రోజుల తర్వాత డబ్బులు సమకూరిన తర్వాత వద్దం అనుకున్నాం అని చెప్పారు సరే అని డాక్టర్ స్కానింగ్ తీయించారు తర్వాత రిపోర్టు వచ్చింది ఆ రిపోర్టులు చూసి అమ్మ మీకున్న సమయంలో మీరు రమ్మని చెబితే మీరు రాలేదు ఆ సమయం చాలా విలువైంది డబ్బు బాధ అవుతుంది కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా పెరిగింది అప్పుడే మీరు ఆ సమయంలోనే స్కానింగ్ తీస్తే తొందరగా కుదుటపడే మందులు నేను రాసేస్తే సరిపోతుంది కానీ సమయం అయిపోయింది కాబట్టి మందులు రాస్తే సరిపోవు కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకోవాలమ్మా దానికి భారీ మొత్తంలో డబ్బు కావాలి మీరు చేసిన తప్పు ఉన్న సమయంలోనే ఏదైనా చేయాలి అనే డాక్టర్ చెప్పారు.
ఇక్కడ మనకు ఏం అర్థమవుతుంది ఏదైనా మనకున్న వ్యవధిలోని మనకున్న సమయంలోనే మనము పూర్తి చేయాలి సమయం అయిపోయిన తర్వాత ఏం చేసినా లాభం లేదు అని ఇక్కడ నీతి అర్థమవుతుంది.